Friday, January 3, 2025

మీడియా స్వేచ్ఛ.. అది ఒకనాటి మాట!

- Advertisement -
- Advertisement -

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత బుధవారం ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పిటిఐ) 77వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సంపాదకుల సమావేశంలో ప్రసంగిస్తున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ ధ్వర్యంలో రూపొందిన ఒక మీడియా పాలసీకి ఆమోదం తెలపడం యాదృచ్ఛికమే అయినా రెండిటినీ పోల్చి మా ట్లాడుకోవాల్సిందే. మీడియా ఒత్తిడులకు లొంగకుండా, ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ప్రజలకు నిజాలు తెలియజేయాలి. దేశాన్ని, సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఫోర్త్ ఎస్టేట్ ది కీలక పాత్ర అన్నారు రాష్ట్రపతి సంపాదకులను ఉద్దేశించి మాట్లాడుతూ. ఇవాళ మెజారిటీ మీడియా ఎవ రి అధీనంలో ఉన్నది? సంపాదక స్వేచ్ఛ పరిస్థితి ఏమిటి? అన్న విషయాలు గౌరవ రాష్ట్రపతికి తెలియవని అనుకో లేం కదా. అయితే మామూలు పరిస్థితుల్లో మీడియా, దా ని సంపాదకులూ ఎలా ఉండాలో చెప్పారు రాష్ట్రపతి.

ఎప్పుడయితే మీడియా స్వేచ్ఛ రాజకీయ పక్షాలు, బడా వ్యాపారుల చేతిలో పడిందో అప్పుడే దాని అర్ధం మారిపోయింది. జాతీయ స్థాయిలో ఇవాళ మీడియా పాలక పక్షా ల కనుసన్నల్లో మెలగాల్సిన పరిస్థితి దాపురించిన విష యం రాష్ట్రపతిగారికి తెలియకుండా ఉంటుందా? సందర్భాన్ని బట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. సంపాదకులు రాష్ట్రపతి చెప్పిన హితవుకు తలాడించడం తప్ప చేయగలిగింది లేదు కదా. సంపాదక స్వేచ్ఛాహరణం జ రుగుతుందనిపించగానే రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని యజమాని దగ్గరికి వెళ్ళడానికి ఇవి మణికొండ చలపతిరావులాంటి మహనీయులు సంపాదకులుగా, పండిత జవహర్ లాల్ నెహ్రూ యజమానిగా ఉన్న రోజులు కావు కదా. స్వాతంత్య్ర పోరాట కాలంలో కాంగ్రెస్ పత్రిక ‘నేషనల్ హెరాల్డ్’కు ప్రముఖ పాత్రికేయుడు చలపతిరావు సంపాదకుడుగా ఉండేవారు. జవహర్ లాల్ నెహ్రూ తదితర కాంగ్రెస్ నేతలు ఆ పత్రిక నిర్వాహకులుగా ఉండేవారు.

స్వాతంత్య్రం వచ్చి నెహ్రూ ప్రధానమంత్రి కాగానే చలపతిరావు సంపాదక పదవికి రాజీనామా రాసుకుని అ లహాబాద్ ఆనంద్ భవన్‌కు (అప్పట్లో కాంగ్రెస్ రాజకీయాలకు నిలయంగా ఉండేది) వెళ్ళి ప్రధాన మంత్రి నె హ్రూను కలిసి దాన్ని సమర్పించారు. నెహ్రూ దాన్ని చించి పడేసి, పత్రిక నిర్వహణ బాధ్యతల నుండి తాను మిగతా కాంగ్రెస్ నాయకులూ తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. సంపాదకుడిగా చలపతిరావుకు పూర్తి స్వేచ్ఛ ఉందని చె ప్పారు. ఇదంతా చలపతిరావుగారే ఒక దగ్గర రాసుకున్నారు. ఇప్పుడా పరిస్థితి ఉందా? పత్రిక లేదా మీడియా స్వేచ్ఛ యజమానులపరం అయిన నేపథ్యంలో రాష్ట్రపతిగారు సంపాదకులను ఉద్దేశించి కాకుండా యజమానులను ఉద్దేశించి.. ఆ మాటకొస్తే ఆ యజమానులు ఎవరి ఒ ళ్ళో కూర్చున్నారో ( గోదీ మీడియా అనే ముద్దు పేరు రా మన్ మెగసెసే అవార్డు గ్రహీత, ప్రముఖ పాత్రికేయుడు రవీష్ కుమార్ పెట్టినట్టున్నాడు) ఆ రాజకీయ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తే బాగుండేది.

గత పదేళ్ళలో మీడియా స్వేచ్ఛాహరణానికి సంబంధించి జరిగిన పరిణామాలను రాష్ట్రపతి ఈ సందర్భంగా మననం చేసుకుంటే బాగుండేది. మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో పడిన కారణంగానే సామాజిక మాధ్యమాల పేరిట సమాచార విశృంఖల విస్ఫోటనం జరుగుతున్నది. ఏ స్వేచ్ఛ అయినా అపరిమితంగా ఉండదు. కానీ ఇవాళ సామాజిక మాధ్యమాల పేరిట చెలామణి అవుతున్న ఈ అపరిమిత స్వేచ్ఛ ప్రధాన స్రవంతి మీడియా చేతులు కట్టేసి, నోళ్ళు కుట్టేసిన ఫలితమే కదా.
ఇప్పుడు ఈ విశృంఖలత్వాన్ని అరికట్టే పేరుతో ఎదురవుతున్న, ముందు ముందు ఎదురు కాబోతున్న ప్రమాదాల ను ఈ దేశ ప్రథమ పౌరురాలు ఉటంకించి ఉంటే బాగుండేది. అటువంటి ఒక ప్రమాదమే, రాష్ట్రపతి మీడియా స్వేచ్ఛను గురించి మాట్లాడుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదించిన మీడియా పాలసీ.
యోగి ప్రభుత్వం రూపొందించిన ఈ మీడియా విధానం ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులపట్ల ప్రజలను ప్రభావితులను చేసే విధమయిన వార్తలను, వార్తా కథనాలనూ ప్రచారం చేస్తే, ప్రసారం చేస్తే అటువంటివారికి ఎనిమిది లక్షల రూపాయలవరకు వ్యాపార ప్రకటనల రూపంలో ఆర్థిక సాయం అందుతుంది.

ఇదేం ఆక్షేపణీయం కాదు. ప్రభుత్వాలు ప్రజాసంక్షేమంకోసం, అభివృద్ధికోసం ఏ మంచి పని చేసినా, దానికి తగిన ప్రచారం కల్పించడం మీడియా బాధ్యత. అయితే దీని వెన్నంటి యోగి ప్రభుత్వం ఈ విధానంలో పొందుపరిచిన మరో అంశం ప్రమాదకరమయింది. సామాజిక మాధ్యమాల పేరిట కొనసాగుతున్న విశృంఖలత్వాన్ని అరికట్టవలసిందే. అయితే యోగి ప్రభుత్వం అటువంటి ధోరణి మీద కాకుండా దేశ వ్యతిరేక సమాచారాన్ని తీవ్రంగా పరిగణించి, దానికి మూడేళ్ళ నుండి యావజ్జీవ శిక్ష వరకు విధించడం జరుగుతుందని ప్రకటించింది. సామాజిక మాధ్యమాలలో పెట్టే పోస్టింగులు, వివిధ ప్రచార ప్రసార మాధ్యమాలలో రాసేది, చూపేది దేశ వ్యతిరేకమా కాదా అనే విషయం ఎవరు నిర్ణయించాలి? దానికో స్వతంత్ర వ్యవస్థ ఉంటే అది వేరు. అలా కాకుండా యోగి ప్రభుత్వ మే దాన్ని నిర్ణయిస్తానంటున్నది. రాజకీయంగా తమకు వ్యతిరేకమయిన లేదా తమ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే సత్యాలు రాసినా, చూపినా వాటిని దేశ వ్యతిరేక వార్తలని ముద్ర వేసే ప్రమాదం ఉంది కాబట్టి యోగి ప్రభుత్వం తెచ్చిన ఈ మీడియా విధానం సర్వత్రా ఆక్షేపణకు గురవుతున్నది.

డిజిటల్ మీడియా పాలసీ పేరిట ఉత్తరప్రదేశ్ ప్ర భుత్వం తెచ్చిన ఈ విధానంలోని సెక్షన్ 7 (2) కింద దేశ వ్యతిరేక, సంఘ వ్యతిరేక లేదా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసే విషయాల మీద చట్టపరమయిన చర్యలు తీసుకునే అధికారం ఆ రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్‌కు ఈ విధానం కల్పిస్తున్నది. తమకు అనుకూల ప్రచారం కల్పిం చే వార్తలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలోకి తెచ్చే గోదీ మీడియా రకానికి పారితోషికాలు ఇచ్చుకుంటే ఫరవాలేదు కానీ దేశ వ్యతిరేకం లేదా దేశద్రోహం వంటి ముద్ర వేసి తమకు గిట్టని సమాచారం ప్రజాబాహుళ్యానికి తెలిపే వారిని అన్యాయంగా శిక్షించే వెసులుబాటు కల్పించే సెక్షన్ 7 (2)ని తొలగించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నది. లేదంటే ఉత్తరప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలు అనుసరించే ప్రమాదం ఉన్నది.

**********

మాజీ పార్లమెంటు సభ్యురాలు, ప్రస్తుత శాసన మండలి సభ్యురాలు వీటన్నిటికీ మించి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు కుమార్తె కవితకు అయిదు మాసాల తరువాత బెయిల్ లభించింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఒక కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నందున అయిదు మాసాలపాటు తీహార్ జైల్‌లో ఉన్నారు. ఆమెకు బెయిలు మాత్రమే లభించింది. కేసు కొనసాగుతూనే ఉంది. ఈ దేశంలో పలువురు రాజకీయ నాయకుల మీద కేసులు ఉండటం, వాళ్ళంతా బెయిలు మీద బయటికి వచ్చి కేసులు కొట్లాడటం కొత్త ఏమీ కాదు. అంతిమ తీర్పు వెలువడే వరకూ ఎవరినీ దోషులు అనడానికి వీలు లేదు. అప్పటిదాకా వారంతా నిందితులే.. కవిత తో సహా.

కవిత బెయిలు మీద బయటకు వచ్చిన విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పత్రికలవారితో జరిపిన చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా ఉన్నాయని సుప్రీం కోర్టు బెంచ్ భావించింది. ముఖ్యమంత్రివంటి రాజ్యాంగ బద్ధమయిన పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆక్షేపణీయమని బెంచ్ భావించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా తనకు న్యాయవ్యవస్థ పట్ల ఎంత గౌరవం ఉందో తెలిపారు. తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదన్నారాయన.

అసలు జరిగినది ఏమిటి? బిఆర్‌ఎస్- బిజెపి కలిసి ఉన్నాయని కాంగ్రెస్, కాంగ్రెస్- బిఆర్‌ఎస్ కలిసి ఉన్నాయని బిజెపి కొంతకాలంగా పరస్పర విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవలే ముగిసిన లోకసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తాను గెలవగలిగే ఒక స్థానంలో కూడా బిజెపికి సాయం చేసిందని కాంగ్రెస్ విమర్శ. అదే మాట మీడియా చిట్ చాట్‌లో ముఖ్యమంత్రి అన్నారు. అదే విధంగా కేంద్ర మంత్రిగా రాజ్యాంగ పదవిలో ఉన్న బండి సంజయ్ కూడా కాంగ్రెస్ నుండి ఇటీవల రాజ్యసభకు ఎన్నికయిన అభిషేక్ సింఘ్వీ కవిత తరఫున వాదించారు కాబట్టి బిఆర్‌ఎస్ కాంగ్రెస్ ఒక్కటయ్యాయన్నారు. వీళ్ళు వాళ్ళని లేదు అవసరం అయినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా, ముఖ్యంగా ఎన్నికల జ్వరం సోకినప్పుడల్లా భారత ప్రజాస్వామ్య మూలస్తంభాలు అన్నిటిమీదా ఇటువంటి దాడి సర్వసాధారణం అయిపోవడం దురదృష్టకరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News