Monday, December 23, 2024

ఇద్దరు చెల్లెల్లను దారుణంగా చంపిన అక్క….

- Advertisement -
- Advertisement -

లక్నో: బాయ్ ఫ్రెండ్ గురించి ఇద్దరు చెల్లెలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారి గొంతు అక్క కోసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఈట్వా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుశీలా దేవికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అంజలి తన ప్రియుడితో కలిసి ఉన్నప్పుడు శిల్పి చూసి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అప్పటి నుంచి శిల్పిపై అంజలి పగ పెంచుకుంది. ఆదివారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా ఇద్దరు సోదరులు గొర్రెలకు కాపారిగా వెళ్లారు. ఇదే అదునుగా భావించిన అంజలి తన సోదరి శిల్పి తలపై పారతో బాదింది. ఇంట్లో నుంచి ఏడుపులు వినబడడంతో మరో చెల్లెలు రోషిని పరుగుగెత్తుకుంటూ వచ్చింది.

రోషిని ముక్కు మూసి హత్య చేసింది. అనంతరం రక్తపు మరకలను తుడిచి వేయడంతో పాటు రక్తంతో నిండిపోయిన దుస్తులను ఉతికి ఆరేసింది. ఇంటికి డోర్ పెట్టి అక్కడి నుంచి పొలం పనులకు వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి ఇద్దరు కూతుళ్లు చనిపోయి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌పి దేహత్ సత్యపాల్ సింగ్, కాన్పూర్ సిటీ ఎస్‌పి కపిల్ దేవ్ సింగ్ అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ నిందితుల ఆనవాళ్లు కనిపించకపోవడంతో పలుమార్లు అంజలిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. సుశీలా దేవి తన కూతురు అంజలిని ఎందుకు దుస్తులు ఉతికావని ప్రశ్నించడంతో మాట మార్చింది. పోలీసులు అంజలిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: కుమారస్వామి కుట్రలు బయటపడ్డాయి: డికె శివకుమార్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News