Monday, December 23, 2024

భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడికి విషం పెట్టి చంపి… రైలు ముందు దూకాడు

- Advertisement -
- Advertisement -

లక్నో: స్వర్ణకారుడు తన భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడికి భోజనంలో విషం పెట్టి చంపి అనంతరం మృతదేహాలను వాట్సప్ స్టేటష్ పెట్టుకున్నాడు. రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంటుండగా అతడిని రైల్వే పోలీసులు కాపాడారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఈత్వా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ముఖేష్ వర్మ అనే స్వర్ణకారుడు అనే వ్యక్తి తన భార్య రేఖా ఇద్దరు కూతుళ్లు, కుమారుడితో కలిసి ఉంటున్నాడు.

నాలుగు అంతస్థుల భవనంలో తన సోదరులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. భోజనంలో విషం కలిసి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడుకి పెట్టాడు. వాళ్లు చనిపోయిన తరువాత వారి మృతదేహాలను వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. రైల్వే స్టేషన్‌కు వెళ్లి మరుధర్ ఎక్స్‌ప్రెస్ ముందు దూకాడు. రైల్వే పోలీసులు అప్రమత్తమై అతడిని కాపాడారు. స్వల్ప గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి మూడు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్త స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News