Saturday, December 21, 2024

ఇద్దరు విద్యార్థులు చెట్టుకు ఉరేసుకొని…

- Advertisement -
- Advertisement -

లక్నో: ఇద్దరు స్కూలు విద్యార్థులు చెట్టుకు అనుమానాస్పదంగా ఉరేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోఇ ఫరీదాబాద్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం…. ఇద్దరు విద్యార్థులు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఓ విద్యార్థి కుటుంబం ఇల్లు మారడంతో బాలుడిని మరో స్కూల్‌లో చేర్పించారు. స్కూలు వేరుకావడంతో ఇద్దరు విడిపోయారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలో ఇద్దరు కలిసి గ్రామం నుంచి బయటకు వెళ్లారు. ఒ విద్యార్థి తన సోదరుడికి ఫోన్ చేసి వస్తున్నానని చెప్పాడు. మరో విద్యార్థి మాత్ర ఫోన్ లిప్ట్ చేయలేదు.

ఇద్దరు విద్యార్థులు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో వాళ్ల కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిద్దార్థ ఆశ్రమం వెనుక భాగం అటవీ ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు చెట్టుకు ఉరేసుకున్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు ఒకే స్కూల్‌లో చదువుకొని ఇప్పుడు వేరు కావడంతో మానసిక ఒత్తిడితోనే వారు ఆత్మహత్య చేసుకొని ఉంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News