Sunday, December 22, 2024

ఎస్‌ఐని కాల్చి చంపిన దుండగులు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఎస్‌ఐని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లా చంద్రపూర్ ఔట్‌పోస్టులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఔరవ్ పోలీస్ స్టేషన్‌లో దినేష్ మిశ్రా(55) అనే పోలీస్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. వరకట్న, మర్డర్ కేసు విచారణ నిమిత్తం తన కానిస్టేబుల్ ధిరాజ్ శర్మతో కలిసి దినేష్ పితాపూర్ గ్రామానికి వెళ్లారు. విచారణ చేసి ఆ గ్రామం నుంచి బయటకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతడి మెడపై కాల్చి చంపాడు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో పరీక్షించిన వైద్యులు చనిపోయారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Also Read: మార్గదర్శి చిట్‌ఫండ్ కేసు బదిలీ పిటిషన్లను డిస్మిస్ చేసిన సుప్రీం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News