Sunday, December 22, 2024

కూతురుపై మాజీ సైనికుడు అత్యాచారం?

- Advertisement -
- Advertisement -

లక్నో: మాజీ సైనికుడు తన కూతురుపై ఆరు సంవత్సరాల నుంచి అత్యాచారం చేస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం శుషాంత్ గోల్ఫ్ సిటీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. భారత్ సైన్యంలో పని చేస్తున్న ఓ సైనికుడు స్వచ్చందంగా పదవి విరమణ చేశాడు. ఆరు సంవత్సరాల నుంచి తన తల్లి, సోదరులపై దాడి చేసి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడని, కుటుంబ ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వలేదని కూతురు తెలిపింది. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని గత కొంత కాలంగా తన కూతురుని వేధించేవాడు. తనపై దాడి చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించినప్పుడు తన తండ్రి నుంచి తనను తాను కాపాడుకున్నానని కూతురు తెలిపింది. కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు… ఆంధ్రాకు ర్యాంకులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News