Sunday, January 19, 2025

ప్రియురాలిని చంపి… ఆమె భర్తకు ఫోన్ చేసి…

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రియురాలిని చంపి అనంతరం ఆమె భర్తకు ఫోన్ చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హిమాంశు(22) తన ప్రియురాలు మధు కలిసి కదరాబాద్‌లో ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. హిమాంశు తన ప్రియురాలిని చంపి అనంతరం ఆమె భర్తకు వీడియో కాల్ చేసి హోటల్ రూమ్‌లో ఉన్నామని, హత్య చేశానని చెప్పాడు. వెంటనే భర్త హోటల్‌కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రూమ్ డోర్లు ఓపెన్ చేశారు. ప్రియురాలి మృతదేహం బెడ్‌మీద ఉండగా ప్రియుడు ప్యానుకు ఉరేసుకున్నాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Also Read: సివిల్స్‌లో విజయానికి అడ్డురాని అంగవైకల్యం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News