Sunday, January 19, 2025

సవతి కుమారుడిని చంపి… కిడ్నాప్ నాటకమాడింది…

- Advertisement -
- Advertisement -

లక్నో: సవతి కుమారుడిని హత్య చేసి మురుగు ట్యాంకులో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మొదటి భార్య విడాకులు తీసుకోవడంతో రాహుల్ సేన్ అనే వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కుమారుడు షాబాద్ తండ్రి వద్ద ఉంటున్నాడు. ఆదివారం షాబాద్ కనిపించకుండా పోవడంతో తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు షాబాద్‌ను కిడ్నాప్ చేశారని రెండో భార్య రేఖ పోలీసులు పక్కదోవ పట్టించింది. ఇంటి సమీపంలో సిసి కెమెరాలను పరిశీలించగా షాబాద్ ఇంట్లో నుంచి వెళ్లినట్టుగా ఎక్కడ కనిపించకపోవడంతో రేఖను పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో తానే హత్య చేశానని ఒప్పుకుంది. షాబాద్‌ను చంపి మురుగు ట్యాంకులో పడేశానని వివరణ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News