Thursday, December 19, 2024

చెల్లిని చంపి నదిలో పడేసిన సోదరులు

- Advertisement -
- Advertisement -

లక్నో: 18 ఏళ్ల చెల్లి గొంతునులిమి చంపి అనంతరం మృతదేహాన్ని గంగానదిలో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుఫియాన్ అనే వ్యక్తి షీబా అనే చెల్లి ఉంది. ఆమె ఇతర కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించడంతో పలుమార్లు షీబాను అతడు మందలించాడు. ఆమె మార్పురాకపోవడంతో సుఫియాన్ తన సోదరుడు మహతబ్‌తో కలిసి చెల్లిని చంపి అనంతరం మృతదేహాన్ని గంగా నదిలో పడేశాడు. వెంటనే పోలీసులు సుఫియాన్, మహతబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తామే చంపేశామని పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. మృతదేహం కోసం ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. సుఫీయాన్‌ది హరిద్వార్‌కాగా మహతబ్‌ది ముజఫర్‌నగర్‌గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News