Friday, December 20, 2024

టైమ్ కు టీ ఇవ్వలేదని… భార్యను నరికిచంపిన భర్త

- Advertisement -
- Advertisement -

లక్నో: టీ తీసుకరావడంలో ఆలస్యం కావడంతో భార్యను భర్త నరికి చంపిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భోజ్‌పూర్ గ్రామంలో ధరమ్‌వీర్(52), సుందరి(50) అనే దంపతులు నివసిస్తున్నారు. ధరమ్ వీర్ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. మంగళవారం ఉదయం టీ తీసుకరమ్మని తన భార్యకు చెప్పాడు. పలుమార్లు ఆమెకు చెప్పినప్పటికి టీ తీసుకరావడంలో ఆలస్యం కావడంతో భార్య మెడను కత్తితో భర్త నరికాడు. ఇంట్లో నుంచి కేకలు వినపడడంతో నిద్రలోని నుంచి లేచి వంట రూమ్‌లోకి ధరమ్ వీరు కుమారుడు వచ్చాడు. తల్లి రక్తపు మడుగులో కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ధరమ్‌వీర్ కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తండ్రిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News