Sunday, January 5, 2025

కన్న బిడ్డల తల, మొండెం వేరు చేసిన తల్లి

- Advertisement -
- Advertisement -

 

లక్నో: తల్లి ఇద్దరు కన్న బిడ్డల తల, మొండెం వేరు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గాజీపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బిజౌరా గ్రామంలో అజిత్ యాదవ్-నీతూ యాదవ్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కూతురు పారీ(09), హ్యాపీ(06), హార్ధిక్(10 నెలల) కుమారులు ఉన్నారు. అజిత్ భారత్ జవాన్‌గా జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి తన తల్లితో కలిసి ముగ్గురు పిల్లలు నిద్రలోకి జారుకున్నారు. ముగ్గురు పిల్లలపై తల్లి కత్తితో దాడి చేసింది. హ్యాపీ, హార్ధిక్ తల, మొండెం వేరు చేసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పారీ అనే అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. నీతు యాదవ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. గాజీపూర్ ఎస్‌పి ఓంవీర్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని రోజుల అజిత్ యాదవ్ మతి స్థిమితం లేకపోవడంతో చికిత్స తీసుకుంటుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అజిత్ యాదవ్ ఇంటికి చేరుకొని కన్న బిడ్డలను చూసి కన్నీరుమన్నీరుగా విలపించారు. దీంతో గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News