Monday, December 23, 2024

మహిళను చంపి… మృతదేహాన్ని తగలబెట్టిన మంత్రగాడు….

- Advertisement -
- Advertisement -

లక్నో: ఓ మహిళతో మంత్రగాడు వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెను చంపేసి మృతదేహాన్ని చెట్ల పోదల్లో పడేసి సగం కాల్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గొండా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దార్థనగర్‌లో మోనా దేవీ కూతుళ్లతో కలిసి జీవనం సాగిస్తోంది. ఆమె భర్త ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలసపోయాడు. భగవాన్ డీన్ అనే మంత్రగాడు ఆమెకు పరిచయం కావడంతో ఇద్దరు మధ్య సానిహిత్యం పెరిగింది. దీంతో అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. భగవన్, మోనా దేవి ఇద్దరు కలిసి కిచొచా షరీఫ్ అనే దర్గాకు వెళ్లారు. దర్గాను దర్శించుకున్న అన్నంతరం ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమెను అతడు గొంతునులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి తగలబెట్టాడు. సగం కాలిన మృతదేహం కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా భగవన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

Also Read: యాంటీ ర్యాగింగ్ కమిటీ చేతుల్లో డాక్టర్ సైఫ్ భవిత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News