Monday, January 20, 2025

టీచర్‌పై స్కూల్ యజమాని అత్యాచారం… వీడియో రికార్డు

- Advertisement -
- Advertisement -

లక్నో: టీచర్‌పై ప్రైవేటు స్కూల్ యజమాని అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో జరిగింది. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఫిబ్రవరిలో టీచర్‌తో ప్రైవేటు స్కూల్ యజమాని అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అఘాయిత్యానికి పాల్పడినప్పుడు వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియో సహాయంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేయడంతో మానసిక వేధింపులకు గురి చేశాడు. స్కూల్‌లో పని ఉందని టీచర్‌కు ఫోన్ చేసి సెక్టార్ సిగ్మా-2కు రమ్మని ఆ కామాంధుడు కబురు పంపాడు. అక్కడి వెళ్లిన తరువాత ఆమెను లైంగికంగా వేధించడంతో జరిగిన విషయం తన భర్తకు తెలిపింది. దీంతో వెంటనే ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యజమానిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: ఆస్పత్రి డీన్‌తో టాయిలెట్లు కడిగించిన ఎంపీ(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News