Tuesday, January 7, 2025

బాయ్ ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతుందని… కూతురిని చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

లక్నో: కూతురు బాయ్ ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతుందని ఆమెను కన్నతండ్రి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గుడుంబా ప్రాంతంలో ఓ వ్యక్తి కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. అతడికి పదో తరగతి చదివే బాలిక ఉంది. ఆమె గత కొన్ని రోజుల నుంచి బాయ్ ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండడంతో వద్దని తండ్రి పలుమార్లు చెప్పాడు. బుధవారం రాత్రి బాయ్ ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా తండ్రి గమనించి మందలించాడు. ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో దుప్పటితో కూతురు గొంతు నులిమి చంపాలని ప్రయత్నించాడు. విచాక్షణ కోల్పోయి కత్తి తీసుకొని ఆమెపై దాడి చేయడంతో ప్రాణాలు విడిచింది. కుమారుడి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన జరిగినప్పుడు మృతరాలి తల్లి తన పుట్టింటిలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News