Monday, January 20, 2025

పడకగదిలో భర్త పురుషాంగాన్ని కొరికిన భార్య… పరిస్థితి విషమం…

- Advertisement -
- Advertisement -

లక్నో: భార్య అసహజ శృంగారం చేయాలని భర్త ఒత్తిడి చేయడంతో అతడి మర్మంగాన్ని ఆమె కొరికిన సంఘటన ఉత్తర ప్రదేశ్ జిల్లా హమీర్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… త్రికౌలి గ్రామంలో రామ్ నిషాద్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అర్థరాత్రి సంభోగంలో ఉన్నప్పుడు అసహజ శృంగారం చేయాలని భారపై భర్త ఒత్తిడి తీసుకొచ్చాడు. అసహజ శృంగారం చేయడం తనకు ఇష్టం లేదని గతంలో పలుమార్లు ఆమె చెప్పింది. అతడు బలవంతం చేయడంతో పురుషాంగాన్ని ఆమె గట్టిక కొరికింది. దీంతో అతడు లబోదిబోమంటూ కేకలు పెట్టాడు. అతడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు అతడి నుంచి ఆమెను వేరు చేసి ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News