Monday, December 23, 2024

చెరువులో పడిన ట్రాక్టర్: 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో శనివారం ఉదయం ట్రాక్టర్ చెరువులో పడింది. కాస్‌గంజ్ వద్ద యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ చెరువులో పడిపోవడంతో 15 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులలో 8 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం. మాఘ పౌర్ణిమ సందర్భంగా గంగ నదిలో స్నానం చేసేందుకు యాత్రికులు ట్రాక్టర్ పై వెళ్తుండగా అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైనా చికిత్స అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News