Thursday, February 20, 2025

మా అమ్మను నాన్నే చంపాడు… డ్రాయింగ్ గీసిన చిన్నారి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఓ మహిళ మృతి కేసు హత్య అని తేలింది. మృతురాలు కూతురు డ్రాయింగ్ గీసి చూపించడంతో ఆమెది ఆత్మహత్య కాదు హత్యేనని వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఝాన్సీలోని కొత్వాలిలో సోనాలీ బుధోలియా అనే వివాహిత(27) మరణించింది. ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని మృతురాలి అత్తమామ, భర్త పేర్కొన్నారు.

సోనాలీ మృతిపై పోలీసులకు అనుమానం రావడంతో విచారణ ప్రారంభించారు. మృతురాలి కుమార్తె దర్శతను దగ్గరికి తీసుకొని వివరాలు రాబట్టారు. దర్శత తన తండ్రి ఫొటోను డ్రాయింగ్ చేసింది. తన తల్లిపై దాడి చేసి అనంతరం ఉరివేసి చంపినట్లు వివరించింది. తనని కూడా చచ్చిపో అని తన తండ్రి అన్నాడని పేర్కొంది. గతంలో తన తల్లిని చంపేస్తానని బెదిరించినట్టు సమాచారం. అదనపు కట్నం కోసం తన కూతురును హతమార్చారని సోనాలీ తండ్రి ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News