Thursday, January 23, 2025

పదో తరగతి విద్యార్థి గొంతు కోసిన స్నేహితుడు

- Advertisement -
- Advertisement -

లక్నో: పదో తరగతి విద్యార్థి గొంతు కోసి స్నేహితుడు హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. న్యూ అజాద్ నగర్‌లోని ప్రయాగ్ విద్య మందిర్ కాలేజీలో నీలేంద్ర తివారికి(15), 13 సంవత్సరాల స్నేహితుడు ఉన్నాడు. నీలేంద్ర తివారి పదో తరగతి చదువుతున్నాడు. ఓ బాలిక విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఇది మనుసులో పెట్టుకొని నీలేంద్రను చంపాలని స్నేహితుడు నిర్ణయం తీసుకొని బ్యాగ్‌లో కత్తి పట్టుకొని వచ్చాడు.

Also Read: చెప్పుతో చెంపలు వాయించుకున్న కౌన్సిలర్(వైరల్ వీడియో)

సోమవారం మధ్యాహ్నం భోజనం చేస్తుండగా తివారితో స్నేహితుడు గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని మెడపై పొడిచాడు. వెంటనే ఉపాధ్యాయులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సదరు విద్యార్థి చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. గొంతు తెగడంతో విద్యార్థి చనిపోయాడని వైద్యులు తెలిపారు. నీలేంద్ర తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు జువైనల్ హోమ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News