Wednesday, January 22, 2025

రొట్టెల కోసం అన్నను చంపి… మృతదేహాన్ని లాక్కెళ్లి నదిలో పడేశాడు…

- Advertisement -
- Advertisement -

లక్నో: రొట్టెలు వండిపెట్టలేదని అన్నను తమ్ముడు అతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని బిల్హౌర్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కల్లూ, భూరా అనే అన్నదమ్ములు నానామవు అనే గ్రామంలో నివసిస్తున్నారు. కల్లుకు వివాహం జరగడంతో రాఖీ పౌర్ణమి సందర్భంగా అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో ఉంటున్నారు. భూరా పని మీద బయటకు వెళ్తూ అన్నను రొట్టెలు వండమని చెప్పాడు. తమ్ముడు ఇంటికి వచ్చేసరికి అన్న రొట్టెలు వండకపోవడంతో ఎందుకు వండలేదని ప్రశ్నించాడు. తనకు రొట్టెలు తయారు చేయలేదని ఇప్పుడు తాను రొట్టెలు చేయలేదనిఅన్న సమాధానం ఇవ్వడంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది.

Also Read: చోరీకి వచ్చి వంటింట్లో నిద్రపోయిన దొంగ

తమ్ముడు బండ రాయి తీసుకొని వచ్చి తమ్ముడి తలపై పలుమార్లు బాదాడు. అనంతరం అన్న మృతదేహాన్ని లాక్కుంటూ వెళ్లి నది దగ్గరికి వెళ్లాడు. పడవలో కొంచెంద దూరం వెళ్లిన తరువాత మృతదేహాన్ని నదిలో పడేశాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని తమ్ముడిని అదుపులోకి తీసుకున్నారు. కల్లు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తమ్ముడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నదిలో మృతదేహం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News