Thursday, January 23, 2025

బాలికను చంపి కాలేయం తిన్న నిందితులకు జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: ఏడేళ్ల బాలికను చంపి అనంతరం కాలేయం, గుండె, శరీర భాగాలను తిన్న నలుగురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఘటమ్‌పూర్‌లో 2020లో పరశరామ్, సునైనా అనే దంపతులు మరో ఇద్దరు అంకూర్, విరెన్‌తో కలిసి ఏడేళ్ల బాలికను చంపారు. అనంతరం కాలేయం, గుండె, వివిధ శరీర భాగాలను వండుకొని తిన్నారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నలుగురు నిందితులకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆ దంపతులకు పిల్లలు పుట్టడంలేదని ఓ మాంత్రికుడు బాలిక కాలేయం తింటే పుడుతారని చెప్పడంతో ఈ దురాగతానికి పాల్పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News