Wednesday, January 22, 2025

ఎంసిఎ విద్యార్థి నోట్లో మూత్రం పోసి… ఉమ్మును నాకించి…

- Advertisement -
- Advertisement -

లక్నో: ఎంసిఎ విద్యార్థిని కిడ్నాప్ చేసి, విద్యార్థి నోట్లో మూత్రం పోసి తీవ్రంగా హింసించిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాన్పూర్‌లో ఓ ఎంసిఎ విద్యార్థి తన స్నేహితుడిని కలుసుకోవడానికి వెళ్తుండగా కొందరు అతడిని కిడ్నాప్ చేశారు. నిందితుల్లో ఒకడు హిమాంశు యాదవ్ తన తండ్రి హెడ్‌కానిస్టేబుల్ ధర్మేంద్ర యాదవ్‌కు సమాచారం ఇచ్చాడు. నగరానికి దూరంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కట్టేసి చితకబాదారు. 12 మంది మూత్రం పోసి అతడితో తాగించారు. చెప్పులపై ఉమ్మి నాలుకతో నాకించారు. దారుణంగా హింసించి అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. మూక దాడికి పాల్పడ్డారు. యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గత సంవత్సరం అక్టోబరులో ఎంసిఎ విద్యార్థిపై ధర్మేంద్ర యాదవ్ హత్యాయత్నం కేసు పెట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News