Monday, December 23, 2024

భక్తురాలిపై కారులో గ్యాంగ్ రేప్…..

- Advertisement -
- Advertisement -

లక్నో: కారులో లిఫ్ట్ ఇస్తామని చెప్పి వాహనాన్ని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ఇద్దరు అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించడంతో పాటు బెదిరించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కౌశంబి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కద ధామ్ ప్రాంతంలో ఓ భక్తురాలు మాతా షీట్ల దేవాలయాన్ని దర్శనం చేసుకుంది. తిరుగు ప్రయాణంలో చీకటి పడడంతో ఒంటరిగా ఉంది. తెలిసిన వ్యక్తులు కారులో వెళ్తుండగా లిఫ్ట్ అడిగింది. వెంటనే లిఫ్ట్ ఇవ్వడంతో కారులో కొంచెం దూరం ప్రయాణించిన తరువాత వాహనాన్ని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.

Also Read: బ్యాంకు అకౌంట్ మీది..లోను వేరెవరికో: యుపిలో భారీ మోసం

కారులో ఆమె నోట్లో గుడ్డలు నొక్కి ఆమెపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేయడంతో పాటు వీడియో చిత్రీకరించారు. ఈ విషయం బయటకు చెబితే నీ కుటుంబంతో పాటు బాధితురాలిని చంపేస్తామని బెదిరించారు. ఆమె వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే వెళ్లి ఎస్‌పిని కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయడంతో పాటు నిందితుల వివరాలను కూడా తీసుకున్నారు. నిందితులు పంచాయతీ మెంబర్ షేరూ, జుబేర్ అహ్మాద్ అని పోలీసులకు చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News