Monday, December 23, 2024

పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

లక్నో: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళా కానిస్టేబుల్‌పై పోలీస్ అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కౌశంబి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రూమ్ సింగ్, మహిళా కానిస్టేబుల్ ఇద్దరు ట్రెయినింగ్‌లో ఉన్నప్పుడు కలుసుకున్నారు. ఆమె పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అతడు పలుమార్లు అత్యాచారం చేశాడు. గత ఫిబ్రవరిలో రూమ్‌సింగ్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఐదు లక్షల రూపాయలు, కారు కట్నం కింద ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పడంతో ఒక్కసారిగా ఆమె కంగుతింది. రూమ్‌సింగ్ వద్దకు వెళ్లినప్పుడు ఆమెను కొట్టడంతో తీవ్రంగా దాడి చేశాడు. దీంతో రూమ్‌సింగ్‌తో పాటు అతడి తల్లిదండ్రులు, సోదరుడుపై ఉన్నతాధికారులు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాల తెలియాల్సి ఉంది.

Also Read: హైదరాబాద్‌లో రేవ్ పార్టీ… సినీ నిర్మాత అరెస్ట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News