Sunday, February 2, 2025

బాలికపై ప్రధానోపాధ్యాయుడు అత్యాచారం… వీడియో వైరల్… విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: బాలికపై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. వీడియోలు బయటకు రావడంతో సదరు విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కౌశాంబిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోకరాజ్ ప్రాంతంలోని సరస్వతి బాల్ విద్యామందిర్ స్కూల్‌లో డికె మిశ్రా అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. బాలిక(15)తో ప్రిన్సిపాల్ పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సదరు విద్యార్థిని మనస్థాపం చెందింది. వెంటనే రైలు కిందపడి బాలిక ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News