Monday, December 23, 2024

బంధించి బాలికపై అత్యాచారం… కాల్చిన ఇనుప చువ్వతో ముఖంపై పేరు రాసి…

- Advertisement -
- Advertisement -

లక్నో: 17 ఏళ్ల బాలికను బంధించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. అనంతరం ఆమె ముఖంపై కాల్చిన ఇనుప రాడ్డుతో నిందితుడి పేరు రాసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమన్(22) అనే యువకుడు జులాయిగా తిరిగేవాడు. ఓ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వెంటపడడంతో ఆమె తిరస్కరించింది. ఆమెపై పగ పెంచుకొని ఒంటరిగా ఉన్న సమయంలో బాలికను బంధించాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి అనంతరం కాల్చిన ఇనున రాడుతో ముఖంపై తన పేరును రాశాడు. దీంతో బాలిక అతడి నుంచి తప్పించుకొని తన కుటుంబ సభ్యుల వద్దకు చేరింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో నిందితుడు హైదరాబాద్‌లోని ఓ సెలూన్‌లో పని చేసినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News