Sunday, December 22, 2024

బాలిక కళ్లను పీకేసి… హత్యాచారం…

- Advertisement -
- Advertisement -

లక్నో: మదర్సా నుంచి ఇంటికి వెళ్తున్న బాలికను చెరుకు చేనులోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి నోట్లోకి బురదు కుక్కి, చెరుకు కట్టేలతో కళ్లను పీకేసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లఖిమ్‌పూర్ ఖేరీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 13 ఏళ్ల బాలిక మదర్సా నుంచి ఇంటికి వెళ్తుండగా దుండగులు ఆమె చెరుకు చేనులోకి లాక్కెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి నోట్లోకి బలవంతంగా బురదను నెట్టారు. అనంతరం చెరుకు కట్టేల సహాయంతో బాలిక కళ్లను పీకేసి హత్య చేశారు. స్థానికుల సమాచార మేరకు ఎస్‌పి నైపాల్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం ఆరు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయని పోరెన్సిక్ నిపుణులు తెలిపారు. ఆమె హత్య చేసే ముందు భయంకరంగా బాధించారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News