Sunday, January 19, 2025

అసెంబ్లీని సందర్శించిన ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్ సతీశ్ మహాన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ అసెంబ్లీని ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్ సతీశ్ మహాన్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు స్వాగతం పలికారు. సతీష్ మహాన్‌కు రాష్ట్ర శాసనసభ నిర్వహణ, పనితీరు గురించి స్పీకర్ పోచారం ఆయనకు వివరించారు. రాష్ట్ర శాసనసభ నిర్వహణ అత్యుత్తమంగా ఉందని, ప్రజా సమస్యలపై చర్చలు అర్ధవంతంగా జరుగుతున్నాయని స్పీకర్ పోచారం ఉత్తరప్రదేశ్ స్పీకర్‌తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ సమావేశాల నిర్వహణ, పద్ధతులపై వారు ఇరువురు చర్చించారు. స్పీకర్ సతీశ్ మహాన్‌ను శాలువాతో సత్కరించిన స్పీకర్ పోచారం ఆయనకు మెమొంటోను బహుకరించారు. ఈ కార్యక్రమంలో లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News