Sunday, January 19, 2025

చావులోనైనా విడదీయవద్దంటూ ప్రేమికుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

ఒరయ్య: కలసి జీవించడానికి అంగీకరించని తమ పెద్దలు కనీసం చావులోనైనా తమను కలపాలని అర్థిస్తూ ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఒరయ్య జిల్లా ముర్చా గ్రామంలో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల శివం కుమార్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. పొరుగునే నివసించే 17 ఏళ్ల బాలిక, అతను ప్రేమించుకున్నారు. అయితే వారి ప్రేమను రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు ఒప్పుకోలేదు.

దీంతో మనస్తాపం చెందిన వారిద్దరూ గ్రామ శివార్లలోని వాటర్ పంపు హౌస్‌కు చెందిన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమను చనిపోయిన తర్వాత కూడా విడగొట్టవద్దని, తమ ఇద్దరి శరీరాలకు జతగా అంత్యక్రియలు నిర్వహించాలని సూసైట్ నోట్‌లో వారు కోరారు. తామిద్దరం సొంతంగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ చావుకు ఎవరూ బాధ్యులు కారని ఆ లేఖలో వారు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపించామని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని బిధున సర్కిల్ పోలీసుఅధికారి ఎంపి సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News