Monday, December 23, 2024

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని చంపాడు…

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఆమెను ప్రియుడు గొంతు నులిమి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాహుల్-కోమల్ అనే యువతి యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కోమల్ తన ప్రియుడు రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలని బలవంతం పెడుతోంది. రాహుల్ కుటుంబ సభ్యులు మాత్రం ప్రేమ పెళ్లికి ఒప్పుకోవడంలేదు. కోమల్‌ను రాహుల్ కలిసి ఏకాంతంగా గడపడానికి కుక్రెల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. పెళ్లి విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో గొంతు నులిమి చంపేసి అనంతరం ఆమె ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి వెళ్లిపోయాడు. తన కూతురు కనిపించడంలేదని కోమల్ తండ్రి సంజయ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె ఫోన్ లోకేషన్ ఆధారంగా అక్కడికి వెళ్లారు. అదే లోకేషన్‌లో రాహుల్ ఫోన్ సిగ్నల్స్ ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News