Sunday, December 22, 2024

పట్టపగలు నడిరోడ్డుపై గొంతు నులిమి చెల్లిని చంపిన అన్నయ్య

- Advertisement -
- Advertisement -

లక్నో: మతాంతర వివాహం చేసుకుంటానని చెప్పడంతో చెల్లిని అన్న పట్టపగలు నడిరోడ్డుపై ఆమె గొంతు నులిమి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నగ్లాషేక్ ప్రాంతంలో మహ్మద్ హాసీన్ అనే వ్యక్తి తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులతో కలిసి ఉంటున్నాడు. హాసీన్ ఎలక్ట్రిషీయన్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అతడి చెల్లెలు మోహిత్ అనే యువకుడిని ప్రేమించింది. మతాంతర వివాహం చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశారు. దీంతో ఇంట్లో కుటుంబ సభ్యులతో యువతి పలుమార్లు గొడవకు దిగింది. బుధవారం తన చెల్లి ప్రేమ వ్యవహారంపై హాసిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో చెల్లిపై అన్న దాడి చేశాడు. యువతి తన అన్నయ్య నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించింది. ఆమెను వెంబడించి పట్టపగలు నడిరోడ్డుపై తన సోదరి గొంతు నులిమి హత్య చేశాడు. గ్రామస్థులు  కళ్లప్పగించి చూశారే కాని ఎవరు అడ్డుకోలేదు. కొందరు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News