Thursday, January 23, 2025

తల్లిని చంపి… మొండెం, తలను వేరు చేసి

- Advertisement -
- Advertisement -

లక్నో: అమ్మ పేరు మీద భూమి పట్టా చేయించలేదని కుమారుడు తల్లిని నరికేశాడు. మృతదేహం నుంచి తలను వేరు చేసి మొండాన్ని అక్కడే పడేసి అతడు పారిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సితాపూర్ జిల్లా తాల్‌గాఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మెజాపూర్ గ్రామంలో కమళా దేవి(65) తన కుమారుడు దినేష్ పాసి(35)తో కలిసి ఉంటుంది. దినేష్ మద్యానికి బానిసగా మారి తల్లిని వేధించేవాడు. భూమి ఉండడంతో తన పేరు మీద పట్టా చేయించాలని ఆమెతో కుమారుడు పలుమార్లు గొడవకు దిగాడు.

ఆమె ఒప్పుకోకపోవడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో పొలం పనులు చేసే బ్లేడు సాయంతో తల్లిని నరికేశాడు. మృతదేహం నుంచి తల వేరు చేశాడు. మొండాన్ని ఇంటి బయట పడేసి అక్కడి నుంచి అతడు పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొండాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల కోసం స్థానికంగా పోలీసులు వెతికారు. నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News