మీర్జాపూర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం రెండు గంటల సమయంలో మీర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ హైవేపై ప్రయాణిస్తున్న బొలేరో వాహనాన్ని బస్సు ఢీకొంది. మహాకుంభ మేళకి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మెజా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా.. మరో 19 మంది గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను స్వరూప్‌రాణి నెహ్రూ మెడికల్ హాస్పిటల్‌కు తరిలించి, పోస్ట్‌మార్టం జరుపుతున్నట్లు యమునానగర్ డీసిపీ వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ అధికారులు ఘటనస్థలికి చేరుకొని వెంటనే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు ఇతర సహాయకచర్యలు చేపట్టాలని అదేశించారు.
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -