Thursday, December 26, 2024

స్నేహితుడి ప్రాణం తీసిన యూట్యూబర్ పార్టీ

- Advertisement -
- Advertisement -

లక్నో: యూట్యూబర్ ఇచ్చిన పార్టీలో స్నేహితుడు ప్రాణం పోయిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మనీశ్ సింగ్ అనే యువకుడు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మనీశ్ యూట్యూబ్‌లో తన లక్ష్యాన్ని చేరుకోవడంతో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. విందు పార్టీకి దీపక్ సింగ్(25) అనే స్నేహితుడిని పిలిచాడు. పార్టీలో అందరూ మద్యం తాగుతుండగా వివాదం చెలరేగింది. ఘర్షణ తారా స్థాయికి చేరుకోవడంతో దీపక్ సింగ్ తలపై యేగేంద్ర, విజయ్ పిడిగుద్దులు కురిపించారు. గొడవ ముగిసిన తరువాత దీపక్ ఇంటికి వెళ్లాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు దుర్మరణం చెందాడు. తలలో రక్తం గడ్డ కట్టడంతోనే అతడు మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. మనీశ్ సింగ్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News