Tuesday, December 24, 2024

వివాహేతర సంబంధం… భర్తను ఐదు ముక్కలుగా నరికి….

- Advertisement -
- Advertisement -

లక్నో: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని ఐదు ముక్కలు నరికి అనంతరం శరీర భాగాలను మూటలో కట్టి కాలువలో పడేసిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం పిలీబీత్ జిల్లాలోని గజ్రౌలా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శివనగర్‌లో రామ్‌పాల్ (55) తన భార్య దులారో దేవితో కలిసి జీవిస్తున్నాడు. ఈ దంపతులకు సోమ్‌పాల్ అనే కుమారుడు ఉన్నాడు. మూడు నెలల క్రిత దేవితో ఇంటి నుంచి బయటకు వెళ్లి 20 రోజుల తరువాత తిరిగి వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి.

Also Read: బురఖా ధరించకపోతే బస్సు ఎక్కకూడదట !

రామ్‌పాల్ మంచంపై గాఢ నిద్రలో ఉన్నప్పుడు చేతులు తాళ్లను కట్టేసి పదునైనా ఆయుధంతో కొట్టి భర్తను భార్య హత్య చేసింది. అనంతర భర్త మృతదేహాన్ని గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికి మూటకట్టి కాలువలో పడేసింది. తన భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోమ్‌పాల్ తమ ఇంట్లో రక్తపు మరకలు ఉన్నాయని చెప్పడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో హత్య చేశానని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News