Friday, December 20, 2024

భార్య, పిల్లలను చంపి వైద్యుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: భార్య పిల్లలను చంపి అనంతరం వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం రాయ్‌బరేలీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వైద్యుడు అరుణ్ కుమార్ సింగ్ (45), అర్చన(40), కుమార్తె అరిబా(12), కుమారుడు ఆరవ్(4)లతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. మోడరన్ రైల్వే ఆస్పత్రిలో కంటి వైద్యుడిగా అరుణ్ కుమార్ సింగ్(45) పని చేస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లల తలలు పగలగొట్టి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అరుణ్ సింగ్ మానసికంగా కుంగిపోయి ఉన్నట్టు సమాచారం. అర్చన, అరుణ్‌లది ప్రేమవివాహం కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News