లక్నో: దళిత మూగ అమ్మాయిపై అత్యాచారం చేసి అనంతరం ప్రైవేట్ పార్ట్‌ను సిగరేట్‌తో కాల్చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ గ్రామంలో 11 ఏళ్ల మూగ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. మంగళవారం సాయంత్రం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో వెతికారు. గ్రామానికి సమీపంలో రక్తపు మరకలతో నగ్నంగా బాలిక స్పృహ తప్పిపోయి కనిపించింది. వెంటనే బాలికను మీరట్ ఆస్పత్రికి తరలించారు. బాలికకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు ప్రైవేటు పార్ట్‌లలో సిగరేటు కాల్చారని, ఆమె ముఖంపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిందని వైద్యులు తెలిపారు.
తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారి విధ్యాసాగర్ మిశ్రా తెలిపాడు. సిసి టివి ఫూటేజీ ఆధారంగా ధన్ సింగ్ నిందితుడిగా గుర్తిచామని పోలీసులు వెల్లడించారు. పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపడంతో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.