- Advertisement -
ముంబై: ఉత్తర్ ప్రదేశ్ లో ఐదో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆదివారం కొనసాగుతోంది. యుపి అసెంబ్లీ ఎన్నికలలో మధ్యాహ్నం 3 గంటల వరకు 46.28 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరు పోలింగ్ కొనసాగనుంది. 12 జిల్లాల్లోని మొత్తం 61 నియోజకవర్గాలకు ఈ దశలో పోలింగ్ జరగుతోంది. 692 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించడానికి దాదాపు 2.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రామాలయ ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న అయోధ్య, ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలుగా భావించే అమేథీ, రాయ్‌బరేలీ జిల్లాలు ఐదవ దశలో దృష్టి సారించాల్సిన జిల్లాలు. ఇవి కాకుండా సుల్తాన్‌పూర్, చిత్రకూట్, ప్రతాప్‌గఢ్, కౌశాంబి, ప్రయాగ్‌రాజ్, బారాబంకి, బహ్రైచ్, శ్రావస్తి, గోండా జిల్లాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
- Advertisement -