Friday, December 27, 2024

పదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ గ్యాంగ్ రేప్?… మర్డర్ ?

- Advertisement -
- Advertisement -

లక్నో: పదో తరగతి విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అయోధ్య జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వేసవి సెలవుల్లో పది తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను స్కూలు ప్రిన్సిపాల్ పాఠశాలకు పిలిచాడు. దీంతో శుక్రవారం ఆమెను తండ్రి స్కూలుకు పంపించాడు. బాలిక భవనం పైనుంచి పడడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. శనివారం చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు ప్రిన్సిపాల్‌తో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు.

తన కూతురుపై అత్యాచారం చేసి అనంతరం భవనం పైనుంచి కిందకు నెట్టేశారని బాలిక తండ్రి ఆరోపణలు చేశాడు. భవనం పైనుంచి పడుతున్నట్టుగా పాఠశాలలో ఉన్న సిసి కెమెరాలో రికార్డు అయ్యింది. వెంటనే బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఐపిసి 376 డి గ్యాంగ్ రేప్, పోస్కో యాక్ట్, 302 మర్డర్, 120 బి కుట్ర, 201 నేరారోపణ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రిన్సిపాల్, స్పోర్ట్ టీచర్ మరో ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐజి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News