Sunday, January 5, 2025

రూ.600 కోసం… కూతురి గొంతుకోసి చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఆరు వందల రూపాయలు ఇవ్వలేదని కూతురును దారుణంగా తండ్రి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షాజహాన్ పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్వాలిలో పూర్తి గుప్తా(24) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంది. తన కూతురిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా పలు అనుమానాలు రావడంతో తండ్రిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తాను ఇచ్చిన ఆరు వందల రూపాయలు ఇవ్వలేదని కూతురిని గొంతు కోసి హత్య చేశానని తండ్రి సంజయ్ గుప్తా తెలిపాడు. కూతురు గొంతు కోస్తూ ఉంటే తండ్రి అలాగే ఉన్నాడని తెలిపింది. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News