Wednesday, January 22, 2025

యువతితో పారిపోవడంతో యువకుడి తల్లిదండ్రులను చంపి…

- Advertisement -
- Advertisement -

లక్నో: పక్కింట్లో యువతితో యువకుడు పారిపోవడంతో అతడి తల్లిదండ్రులను చితకబాదడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లా హర్గామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజేయ్‌పూర్ గ్రామంలో అబ్బాస్, కమ్రూల్ నిషా అనే దంపతులు నివసిస్తున్నారు. అబ్బాస్ కుమారుడు పక్కింటి అమ్మాయితో పారిపోయాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొన్ని రోజుల క్రితం అబ్బాయి కుమారుడు జైలు నుంచి విడుదల కావడంతో పక్కింటి వారు అబ్బాస్, కమ్మ్రూల్‌పై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో చనిపోయారు. ఎస్‌పి మిశ్రా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News