Monday, December 23, 2024

తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికి… సూట్‌కేసులో కుక్కి… వీధిలో పడేశాడు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఆస్తి వివాదంలో తండ్రిని చంపి… మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి… శరీర భాగాలను సూట్‌కేసులో పెట్టి ఇంటి వెనుక వీధిలో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తివారిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్ కుంద్ కాలనీలో మురళీ ధర్ గుప్తా అనే వ్యక్తి తన కుమారులు సంతోష్ కుమార్ గుప్తా, ప్రశాంత్ గుప్తాతో కలిసి జీవిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి మురళీ ధర్ గుప్తా, సంతోష్ కుమార్ గుప్తా మధ్య ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

శనివారం ఆస్తి విషయంలో మురళీ ధర్ గుప్తా, సంతోష్ కుమార్ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో సుత్తె తీసుకొని తండ్రి తలపై కుమారుడు బాదాడు. దీంతో తండ్రి ఘటనా స్థలంలోనే చనిపోయాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు నరికి అనంతరం సూట్‌కేసులో కుక్కాడు. సూట్‌కేసును ఇంటి వెనుక భాగంలో పడేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌పి క్రిష్ణ కుమార్ బిష్ణోయ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం మురళీదిగా గుర్తించడంతో ప్రశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో భాగంగా సంతోష్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించగా తానే హత్య చేశానని సంతోష్ ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News