Sunday, December 22, 2024

మేకల కోసం తల్లిని చంపి… మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు

- Advertisement -
- Advertisement -

లక్నో: మేకలను అమ్మనివ్వలేదని కన్నతల్లిని కుమారుడు సుత్తెతో కొట్టి చంపి అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోన్‌భద్రా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బచ్రా గ్రామంలో కమ్లేశ్ దేవి (50) తన కుమారుడు కిషున్ బిహారీ యాదవ్, కోడలుతో కలిసి ఉంటుంది. ఎనిమిది సంవత్సరాల క్రితం భర్త సత్యనారాయణ చనిపోవడంతో కొడుకు, కోడలు దగ్గర ఉంటుంది. ఆమె మేకలు కాపరిగా ఉంటూ జీవనం సాగిస్తోంది. మేకలను అమ్మాలని కుమారుడు ప్రయత్నించడంతో తల్లి పలుమార్లు తిరస్కరించింది. మేకల విషయంలో తల్లి కొడుకు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మేకలను అమ్మేందుకు దళారులను కుమారుడు ఇంటికి తీసుకరావడంతో తల్లి అమ్మనివ్వలేదు. దీంతో తల్లి, కుమారుడు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో సుత్తె తీసుకొని ఆమె తలపై పలుమార్లు బాదాడు. అమె చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇంట్లో నుంచి మంటలు రావడంతో గ్రామస్థులు వెంటనే మంటలను ఆర్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సగం కాలిన మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామం నుంచి పారిపోయిన కుమారుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News