Friday, December 20, 2024

కారులో పిల్లల ముందే భార్యను గొంతునులిమి చంపిన భర్త…

- Advertisement -
- Advertisement -

లక్నో: కారులో పిల్లల ముందు భార్యను భర్త గొంతు నులిమి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్‌పూర్‌లోని లక్నో-పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాహుల్ మిశ్రా, మౌనిక గుప్తా(32) అనే దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నాడు. గత కొంత కాలంగా మౌనిక వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానం పెంచుకున్నాడు. తన కుటుంబంతో కలిసి రాహుల్ లక్నో నుంచి రాయ్‌బరేలీకి కారులో వెళ్తున్నారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిలోని సేర్ గ్రామానికి రాగానే తన భార్యను భర్త గొంతు నులిమి చంపాడు. పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సరైన సమయంలో రాకపోతే కూతురు, కుమారుడిని కూడా చంపేవారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి రాహుల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News