- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభిస్తున్న వేళ మాస్కులు ధరించడం, సురక్షితంగా ఉండటం మరింత అవసరమని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపించడంతో చాలా మంది అధికారులు డబుల్ మాస్క్‌లు ధరించాలని సూచించారు. ఇలాంటి సందర్భంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జుగాడు బాబా ప్రత్యేకమైన హెర్బల్ మాస్క్ ధరించాడు. వేప, తులసి ఆకులతో తయారు చేసిన ఈ మాస్క్ సాధరణంగా ఉపయోగించే మాస్కుల కంటే ప్రభావితంగా పనిచేస్తుందని చెప్పాడు. అతని వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఐపిఎస్ అధికారి రూపీన్ శర్మ పోస్ట్ చేశారు. అంతే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. వీడియోలో బాబా కుంకుమ రంగు బట్టలు ధరించి రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిలబడి ఉన్నట్లు చూడవచ్చు.
https://twitter.com/rupin1992/status/1396041839656849408
- Advertisement -