Thursday, December 19, 2024

అందుకోసమే తల్లిని చంపాడు… పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లాడు..

- Advertisement -
- Advertisement -

లక్నో: డ్రగ్స్ కొనుగోలు చేయడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కుమారుడు కత్తితో పొడిచి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమన్ గార్డెన్‌లో షారూక్ (25) అనే వ్యక్తి తన తల్లితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. గత కొన్ని రోజుల ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. డ్రగ్స్ తీసుకోవడానికి తల్లి డబ్బులు ఇవ్వడంలేదని ఆమెపై అతడు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తన తల్లి తనకు తెలియకుండ ఇల్లు అమ్మేందుకు ప్రయత్నం చేస్తుందని అతడు అనుమానించాడు. దీంతో డ్రగ్స్‌కు డబ్బులు ఇవ్వాలని తల్లిని అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వనని నిరాకరించడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని ఆమె కడుపులో పలుమార్లు పొడిచాడు. రక్తపు మడుగులో పడిపోయింది. వెంటనే రూమ్‌ను శుభ్రం చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌ కు నడుచుకుంటూ వెళ్లి అతడు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News