Friday, November 22, 2024

ఉత్తరాఖండ్ పౌరస్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. మతంతో సంబంధం లేకుండా వివాహాలు, విడాకులు, భూములు , ఆస్తులు, వారసత్వ చట్టాలు అందరికీ ఒకే రీతిలో వర్తించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టగా, బిల్లు సభ ఆమోదం పొందింది.

ఈ బిల్లు ప్రకారం సహజీవనం సాగించడాన్ని కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. బాల్య వివాహాలపై సంపూర్ణ నిషేధం ఉంటుంది. విడాకులకు సంబంధించి యూనిఫాం విధానం అమల్లోకి వస్తుంది. అన్ని మతాల్లోని మహిళలకు ఆస్తిలో సమాన హక్కులను ఈ చట్టం కల్పిస్తుంది. యూసిసి చట్టం ప్రకారం యువతుల వివాహ వయోపరిమితి 18 ఏళ్లుగా, యువకుల వివాహ వయోపరిమితి 21 ఏళ్లుగా నిర్ధారించారు. వివాహాల రిజిస్ట్రేషన్ అన్ని మతాల వారికి తప్పనిసరి. ఏడాది తరవాత మాత్రమే విడాకుల పిటిషన్లను అనుమతిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News