Monday, March 3, 2025

హిమపాతం దుర్ఘటనలో నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్ లో భారీ ఎత్తున మంచు పెళ్లలు విరిగిపడిన ప్రమాదంలో మంచుకిందకూరుకుపోయిన 50 మందిని రక్షించారు. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ఎత్తు ప్రదేశంలో మన గ్రామం వద్ద బదరీనాథ్ వెళ్లే మార్గంలోని సరిహద్దు రోడ్ల సంస్థ శిబిరంపై పెద్దఎత్తున మంచు పెళ్లలు విరుచుకుపడ్డాయి. మంచులో కూరుకుపోయిన నలుగురు చనిపోయారు. మరో ఐదుగురు కార్మికులకోసం గాలిస్తున్నారు. ప్రమాదం వార్త తెలియగానే ఏకంగా ఆరు హిలికాప్టర్లను రంగంలోకి దించారు. భారత సేన్యం వైమానికదళానికి చెందిన మూడు హెలికాప్టర్లు, ఐఎంఎఫ్ కు చెందిన రెండు హెలికాప్టర్లు, ఆర్మీ అద్దెకు తీసుకున్న మరో హెలికాప్టర్ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి.

శుక్రవారం తెల్లవారు జామున 5-6 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది.దీంతో 8 కంటైనర్లు, ఓ షెడ్ లో ఉన్న 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు. శుక్రవారం రాత్రి కల్లా 33 మందిని రక్షించారు. మొత్తం మీద ఇప్పటివరకూ 50 మందిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన నలుగురు చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చారు. సి సెంట్రల్ కమాడ్ కు చెందిన లెఫ్ట్ నెంట్ జనరల్, అనింద్య సేన్ గుప్తా, లెఫ్టినెంట్ జనరల్ డిసి మిశ్రా ఆ ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News