Wednesday, January 22, 2025

లవ్‌జిహాద్ ఎఫెక్ట్.. బిజెపి నేత కూతురు పెళ్లి రద్దు

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో బిజెపి నేత , మాజీ ఎమ్మెల్యే యశ్‌పాల్ బెనామ్ తన కూతురు పెళ్లిని నిలిపివేశారు. పౌరీ ప్రాంతానికి చెందిన ఈ నేత కూతురి పెళ్లి ఈ నెల 28న ఓ ముస్లిం యువకుడితో జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు అచ్చయి, పలువురికి వీటిని పంపించారు. అయితే బిజెపి నేత ఇంట్లోనే ఈ మతాంతర వివాహం జరిగిందంటే లవ్‌జిహాద్ సంగతి ఏమిటని నిరసనలు వ్యక్తం అయ్యాయి. కేరళలో లవ్ జిహాద్‌లతో యువతులను ముస్లిం మతంలోకి మార్చి తరువాత వారిని ఇస్లామిక్ తీవ్రవాదదళంలోకి చేరుస్తున్నారనే ఇతివృత్తంతో వచ్చిన సినిమా ది కేరళ స్టోరీని ప్రధాని మోడీ మొదలుకుని పలువురు బిజెపి నేతలు సమర్థించారు.

అయితే బిజెపి పాలిత రాష్ట్రం అయిన ఉత్తరాఖండ్‌లో ఓ బిజెపి నేత ఇంట్లో ఇప్పుడు జరుగుతున్నదేమిటని విహెచ్‌పి, భైరవ్ సేన, భజ్‌రంగ్‌దళ్ నిరసనలు వ్యక్తం చేశాయి. కేరళకో నీతి, ఉత్తరాఖండ్‌కు మరోటా? బిజెపి ద్వంద్వ ప్రమాణాల సంగతి ఏమిటని ప్రశ్నలు తలెత్తడం, పలు చోట్ల ఈ బిజెపి నేత దిష్టిబొమ్మలు తగులబెట్టిన క్రమంలో ఈ పెళ్లి నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. తన కూతురు సంతోషం కోసం ముందు అంగీకరించానని, అయితే తాను ప్రజల వాదనను కూడా వినాల్సి ఉంటుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News