Monday, January 20, 2025

లోయలో పడిన బస్సు: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికుల బస్సు లోయలో పడడంతో ఏడుగురు మృతి చెందగా 20 మంది యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఉత్తర కాశీలో గంగోత్రి జాతీయ రహదారిపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా గుజరాత్‌కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు. గంగోత్రి ధామ్ నుంచి ఉత్తకాశీ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు భగవంతుడు తట్టుకునే శక్తితో పాటు మనోధైర్యం ఇవ్వాలని, వారి పట్ల సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధించారు.

Also Read: లద్దాఖ్ మృతుల్లో మన వీర జవాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News