Sunday, January 19, 2025

చార్ ధామ్ యాత్ర మొదలు

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాల పోర్టల్స్‌ను తెరవడంతో చార్ ధామ్ యాత్ర శనివారం ప్రారంభకానుంది. వేలాది మంది భక్తులు, పరిపాలన, ఆలయ కమిటీ అధికారుల సమక్షంలో గంగోత్రి ద్వారాలను యమునోత్రి ద్వారాలను తెరువనున్నారు. ఆలయాల ప్రారంభానికి గుర్తుగా పూజారులు వైదిక ఆచారాలను ప్రారంభించే ముందు గంగా, యమునా దేవతల విగ్రహాలను వారి శీతాకాలపు నివాసాల నుండి పూలతో అలంకరించబడిన పల్లకిలలో తీసుకరానున్నారు.

కాబట్టి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో యాత్రికులు చార్ ధామ్‌ను సందర్శించేందుకు ఇష్టపడుతారు. అయితే, హిమాలయ పుణ్యక్షేత్రాలలో వారికి పరిమిత వసతి అందుబాటులో ఉన్నందున వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయాలను సందర్శించే యాత్రికుల సంఖ్యపై రోజువారీ పరిమితి విధించబడుతుంది. గంగోత్రి, యమునోత్రి ప్రారంభోత్సవం చార్ ధామ్ యాత్ర ప్రారంభాన్ని సూచిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News